నా అంత తీవ్రవాది ఉండడు..వారి అంతు చూస్తానని వేర్పాటు వాదులపై విరుచుకుపడ్డారు పవన్ కళ్యాణ్. ప్రతి ఒక్కరూ మా రాష్ట్రం మాకు కావాలంటే కుదరదు. ధర్మాన, బైరెడ్డి లాంటి వాళ్లు రాష్ట్రం కావాలంటారా..? అని ఆగ్రహించారు. వైసీపీనే కాదు.. ఏ పార్టీ నేత అయినా మళ్లీ వేర్పాటు వాదం గురించి మాట్లాడితే నా అంత తీవ్రవాది ఉండడని హెచ్చరించారు.
ఎవడికి వాడు రాష్ట్రం కావాలంటూ స్టేట్మెంట్లు ఇస్తారా..?మీరేం చేశారు.. మీరేమన్నా త్యాగాలు చేశారా..? అని నిలదీశారు. వారాహి ఎలా రోడ్ల మీదకు వస్తుందో చూస్తామంటున్నారని..నేను చట్టాలను గౌరవించేవాడిని.. కోడి కత్తితో పోడిపించుకుని డ్రామాలాడేవాడిని కానని వైసీపీ పై మండిపడ్డారు. నేను సీఎం అయితే ఏంటీ.. కాకుంటే ఏంటీ..? కానీ నేను సీఎం అయితే ప్రజలకు మేలు జరుగుతుందని మీరు కోరుకుంటే అవుతానన్నారు.
సీఎం మా కులస్తుడని ఓటేస్తే ఎలా..? వైసీపీ నేతలను తిట్టడం నాకేం సరదానా..? అని నిలదీశారు. కానీ ఇష్టానుసారం మట్లాడితే నా అంత తీవ్రవాది ఉండడన్నారు. తెలంగాణ విభజన తర్వాత ఏపీ ఏమైపోతోంది…ఏపీని పాలిస్తున్న వైసీపీ నేతలకు సిగ్గుందా..? రూ. 5 వేలు ఇస్తే సరిపోతుందా..? వాలంటీర్ ఉద్యోగం సరిపోతుందా..? అని ఆగ్రహించారు.