BREAKING: బెంగళూరు బయలు దేరిన పవన్‌ కల్యాణ్

-

Pawan Kalyan left Bangalore: బెంగుళూరుకు బయలుదేరి వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌. ఈ పర్యటన లో కర్ణాటక అటవీ శాఖ మంత్రితో సమావేశం కానున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
ఎర్రచందనం అక్రమ రవాణ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కర్ణాటక అటవీ మంత్రితో పవన్ కళ్యాణ్ చర్చలు ఉంటాయి. పొరుగు రాష్ట్రాల సహకారంతో ఎర్ర చందనం దోపిడీని అరికట్టేలా పవన్ ప్రణాళికలు చేస్తున్నారు.

Pawan Kalyan left Bangalore

ఎర్ర చందనం స్మగ్లింగ్ కట్టడి కలిసి పని చేయాలని అటవీ శాఖ మంత్రిని కోరనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. కర్ణాటక నుంచి ఆరు కుంకీ ఏనుగులను ఏపీకి ఇవ్వాలని కోరనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…. పొలాల మీద పడే ఏనుగుల మందను తరమడానికి కుంకీ ఎనుగులు అవసరమని చెప్పారు అటవీ శాఖ అధికారులు. ఏపీలో అందుబాటులో కేవలం రెండు కుంకీ ఏనుగులే ఉన్నాయి. కుంకీ ఎనుగుల కొరతతో ఊళ్ల మీద పడే ఏనుగుల మందను తరమలేకపోతోంది అటవీ సిబ్బంది. దీంతో కర్ణాటకలో కుంకి ఏనుగులు లభ్యత ఉంటుందని డిప్యూటీ సీఎంకు చెప్పారు అధికారులు. ఈతరుణంలోనే.. తానే స్వయంగా కర్ణాటక ప్రభుత్వాన్ని కోరతానని గతంలోనే చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news