BREAKING : జనవాణి కార్యక్రమంపై పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం

-

BREAKING : జనవాణి కార్యక్రమంపై పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. విశాఖ లో ఇవాళ నిర్వహించే జనవాణి కార్యక్రమాన్ని తాత్కలికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు.

జనవాణి జనం గొంతుక అని.. సమస్యలు ప్రభుత్వం పరిష్కారిస్తే మా దగ్గర కు ఎందుకు వస్తారని నిలదీశారు. 3000 కు పైగా జనవాణి కార్యక్రమానికి పిటిషన్లు వచ్చాయని… వాటికి సంబంధించి ఆయా శాఖలకు తెలిపామన్నారు.

మా తండ్రి పోలీస్ కానిస్టేబుల్ అని.. అందుకే పోలీసులు అంటే నాకు గౌరవమని చెప్పారు పవన్‌ కళ్యాణ్‌. ప్రభుత్వంలో గర్జించడం ఏంటి? కడుపు కాలిన వాడు గర్జిస్తాడు. అధికారంలో ఉన్నవారు గర్జిస్తామంటారేంటి? పథకాలు అమలు చేయాలి.. నిరసన తెలుపుతామంటే ఎలా? అని ఆగ్రహించారు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news