వైసీపీ నాయకులు పద్దతి మార్చుకోవాలని పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. జనసేన ను ఒక కులానికి అంతగట్టే వ్యాఖ్యలను వైసీపీ నాయకులు వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్వాతంత్య్ర దినోత్స వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజ్యాంగ స్ఫూర్తి పై నిజాయితీగా వ్యవహరించాలన్నారు.
అయ్యప్ప దేవాలయం ప్రవేశం గురించి మాట్లాడే వాళ్ళు ఇతర మతాల లో ఉన్న లోపాలను విమర్శించలేదు…ఇదే సెక్యులరిజమా? అని నిలదీశారు. అవసరాల కోసం సెక్యులరిజం భావాలు చెప్పొద్దు…తప్పు ఎవరు చేసినా ముక్త కంఠంతో ఎదుర్కోవాల్సిన పరిస్తితి ఉందన్నారు. నేను ఒక కులం కోసం రాజకీయాల లోకి రాలేదని.. నేను సోషలిస్ట్ భావాలతో జాతీయ భావం తో పెరిగిన వాడ్ని అని కుండ బద్ధలు కొట్టారు. భాధ్యత కలిగిన సీఎం స్థానం లో ఉండి కూడా జగన్ కులాల ప్రస్తావన చేస్తున్నారని మండిపడ్డారు. చర్చిలను, మజిద్ లను కాపాడి దేవాలయాలను వదిలేస్తే సెక్యులరిజం కాదని చురకలు అంటించారు.