పోలవరం వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ప్రకటన చేశారు. నాకు కాఫర్ డ్యాం అంటే ఏంటో తెలియాల్సిన అవసరం ఏం ఉంది?? నేను కాంట్రాక్టర్‌నా? ఇంజనీర్‌నా? తెలియటానికి… నాకు కామన్ సెన్స్ ఉంది… చిత్తశుద్ధి ఉందన్నారు. ఆరోగ్య శాఖ మంత్రికి ఆపరేషన్ చేయటం రావాలా?? ఎదుటి వాళ్ళను గేలి చేయాలని ప్రయత్నించటం దుర్మార్గమని ఫైర్ అయ్యారు.
పోలవరం వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని… నష్టం జరిగే మండలాలు ఏపీలోనే ఉన్నాయని పేర్కొన్నారు. 1995లో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పోలవరం గురించి ఎందుకు ఆలోచన చేయలేదు.. రాజశేఖర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే… చంద్రబాబు తానే భుజస్కంధాలపై మోస్తున్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ఏమయ్యా రాంబాబు అని దేవినేని ఉమ అంటున్నాడు… మరోసారి ఇలా అంటే నేను కూడా ఒరేయ్…తురేయ్ అనాల్సి ఉంటుందని హెచ్చరించారు అంబటి రాంబాబు. పోలవరం జాప్యానికి కారణం జగన్ ప్రభుత్వం అని బ్రాండింగ్ చేయటానికి టీడీపీ, టీడీపీ మద్దతు మీడియా ప్రయత్నం చేస్తున్నారన్నారు.