తిరుపతిలో వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్న పీవీ సింధు

తిరుపతి జిల్లా లో వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా… అమ్మవారిని దర్శించుకున్నారు ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి పివి సింధు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పివి సింధు మీడియాతో మాట్లాడుతూ.. వెంకటగిరి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.

2016 లో ఒలింపిక్స్ తర్వాత శ్రీ పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. తనకి అమ్మవారిపై చాలా నమ్మకం ఉందని తెలియజేశారు. ప్రతి ఏటా ఈ జాతరకు వస్తుంటానని చెప్పుకొచ్చారు. అందుకే ఈ సంవత్సరం కూడా వచ్చానని.. వెంకటగిరి అమ్మవారి ఆశీస్సులతో ఇంకా బాగా ఆడతానని అన్నారు పీవీ సింధు.