రాజ్యసభ సభ్యుడిగా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసినన ఆర్ కృష్ణయ్య

-

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు ఆర్.కృష్ణయ్య. ఆయన తన ప్రమాణస్వీకారాన్ని తెలుగులోనే కొనసాగించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా అనూహ్యంగా తెరపైకి వచ్చారు ఆర్.కృష్ణయ్య. ఇక ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలకు విజయసాయిరెడ్డి, మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో తెలంగాణకు చెందిన పార్థసారధి రెడ్డి, దామోదర రావు, ఏపీ రాజ్యసభ సభ్యుడిగా ఆర్.కృష్ణయ్య. ముగ్గురు రాజ్యసభ సభ్యులు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.

కాగా 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్.కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 2014లో ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపొందారు. 2018 లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఆర్.కృష్ణయ్య టిడిపి సీఎం అభ్యర్థిగా నిలబడ్డారు. ఆ తర్వాత టిడిపికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి మిర్యాలగూడ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆర్.కృష్ణయ్య మళ్లీ ఇప్పుడు ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావడం పట్ల బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news