మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే చాలా మంది ప్రముఖులను విచారించింది సిబిఐ. ఇక తాజాగా ఈ కేసుపై నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు సిబిఐకి బహిరంగ లేఖ రాశారు. పరిటాల రవి నిందితులను అంతమొందించిన కుట్ర తరహాలోనే వైఎస్ వివేకా హత్య కేసు నిందితులను కూడా జైల్లోనే మట్టుబెట్టే కుట్ర జరుగుతోందని ఆయన లేఖలో ఆరోపణలు చేశారు.
జైల్లో ఉన్న వారికి,జైలు బయట ఉన్నా నిందితులకు సాక్షులకు రక్షణ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. వివేక హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే ఎన్నో సీబీఐ కేసులో విజయసాయిరెడ్డి ఎటు గా ఉన్నారని, సిబిఐ ఆయనను పిలిచి వివేకా హత్య కేసులో ప్రశ్నించాలని కోరారు. ఈ కేసులో గొడ్డలి అనే పదం ఎలా బయటకు వచ్చింది ఆయనకు ఎవరు చెప్పి ఉండవచ్చు అనే కోణంలో విచారించాలని పేర్కొన్నారు. గుండెపోటు అని చెప్పిన విజయసాయిరెడ్డిని కచ్చితంగా విచారించాలని డిమాండ్ చేశారు.