జగన్‌ను చూసే పెట్టుబడులు పెడుతున్నారని చెప్పుకోవడానికే ఈ డ్రామాలు – రఘురామ

-

జగన్‌ను చూసే పెట్టుబడులు పెడుతున్నారని చెప్పుకోవడానికే ఈ డ్రామాలు ఆడుతున్నారని రఘురామకృష్ణ రాజు ఫైర్ అయ్యారు. తన ముఖం చూసే రాష్ట్రంలో 11 లక్షల రూపాయల పెట్టుబడులను పారిశ్రామికవేత్తలు పెడుతున్నారని జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పుకోవడానికే ఈ డ్రామా అంతా అని రఘురామకృష్ణ రాజు గారు విమర్శించారు. రాష్ట్రంలో నూతనంగా పరిశ్రమలు వస్తే అక్కడే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని యువతను మరోసారి మోసగించేందుకే ఈ ప్రయత్నం అని అన్నారు.

 

గతంలో జాబ్ క్యాలెండర్ అన్నారు… జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన పాపాన పోలేదని, జగన్ మోహన్ రెడ్డి గారి దెబ్బకు నిరుద్యోగం అబ్బా అనాలి అని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారు చేసిన ట్విట్ ను ప్రస్తావిస్తూ… ఈ విధంగానే రానున్న ఎన్నికల్లో తమ పార్టీ నాయకులు ప్రచారం చేసుకోనున్నారని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. రెన్యుబుల్ ఎనర్జీ పరిశ్రమలు ఏర్పడితే పెద్దగా ఉద్యోగ అవకాశాలు ఉండవని, రాజస్థాన్ లో 15 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని, అక్కడ ఎన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయో తెలుసుకోవాలని సూచించారు. 10, 000 మెగావాట్ల పార్కు అయినా 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పార్కులోనైనా పదుల సంఖ్యలోనే ఉద్యోగులు ఉంటారన్నారు.

 

రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమల వల్ల రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నన్ని ఉద్యోగ అవకాశాలు లభించవని, రాష్ట్ర ప్రభుత్వం చెప్పేవన్నీ తప్పుడు లెక్కలేనని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. చిత్తశుద్ధితో పరిశ్రమలను ఏర్పాటు చేయాలని భావిస్తే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి విధానాలను అవలంబించాలని సూచించారు. ప్రధాని గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలను, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి గుజరాత్ లో పరిశ్రమల ఏర్పాటు చేయవలసిందిగా కోరారని, ఎంతో మంది పారిశ్రామికవేత్తలు అక్కడి ప్రభుత్వం కల్పించిన సబ్సిడీలు ప్రోత్సాహకాలతో గుజరాత్లో పరిశ్రమలను ఏర్పాటు చేశారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news