కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న రాహుల్ గాంధీ పాదయాత్ర

-

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతోంది. మంగళవారం రోజున కర్నూలు జిల్లాలో ప్రవేశించిన పాదయాత్ర.. రెండో రోజు బుధవారం ఆదోని మండలం చాగి నుంచి ఈ ఉదయం ప్రారంభమైంది. ఢణాపురం మీదుగా ఆదోని పట్టణానికి రాహుల్‌ చేరుకున్నారు.

ఆదోని పట్టణ ప్రధాన రహదారుల గుండా ప్రజలకు అభివాదం చేస్తూ రాహుల్‌ ముందుకు సాగారు. పట్టణంలోని మహాలక్ష్మి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం సాయంత్రం వివిధ గ్రామాల మీదుగా ఎమ్మిగనూరు మండలంలోకి పాదయాత్ర ప్రవేశించనుంది. రాహుల్‌ వెంట ఏపీపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌, సీనియర్‌ నేతలు దిగ్విజయ్‌సింగ్‌, జేడీ శీలం, పల్లంరాజు, కనుమూరి బాపిరాజు, ఎమ్మెల్యే సీతక్క నడిచారు.

మంగళవారం రోజున కర్నూలు జిల్లాలో ప్రవేశించిన భారత్​ జోడో యాత్రలో రాహుల్ గాంధీని అమరావతి రైతులు కలిశారు. అమరావతినే రాజధానిగా ఉండాలని రాహుల్​ను కోరారు. అమరావతే ఆంధ్రప్రదేశ్​కు ఏకైక రాజధానిగా ఉంటుందని రాహుల్ గాంధీ చెప్పినట్లు అమరావతి రైతులు తెలిపారు. తమ పాదయాత్రకు సంఘీభావం తెలిపారని.. వీలైతే పాదయాత్రలో పాల్గొంటానని రాహుల్​ చెప్పినట్లు రైతులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news