ఏపీ రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్. రేషన్ కార్డుదారులకు వచ్చే నెల నుంచి ఐరిస్ ఆధారిత ఆధార్ ధ్రువీకరణతో కూడా నిత్యవసరాలు పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ‘ప్రస్తుతం ఈ పోస్ యంత్రంతో వేలిముద్రల ఆధారంగా రేషన్ ఇస్తున్నాం. అయితే కూలీలు, వృద్ధులు, దివ్యాంగులు, ఇతర వ్యాధిగ్రస్తులకు వేలిముద్రలు పడకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
దీంతో రేషన్ పంపిణీ వాహనాల్లో ఈ పోస్ తో పాటు ఐరిస్ యంతాలను పెడుతున్నాం’ అని ప్రకటించింది. కాగా, ప్రజలకు అనేక విధాలుగా సహాయపడుతున్న వాలంటీర్లకు నేటి నుంచి అవార్డులను ప్రభుత్వం అందజేయనుంది. వాలంటీర్లకు వందనం పేరుతో రూ.243 కోట్లను వెచ్చించనుంది. ‘సేవా వజ్ర’ పొందిన 875 మందికి రూ. 30 వేల చొప్పున నగదు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్ అందజేస్తారు. సేవారత్న పొందిన 4,220 మందికి రూ. 20వేలు, సర్టిఫికెట్, శాలువా, బ్యాడ్జ్, మెడల్, సేవామిత్ర పొందిన 2,28,624 మందికి రూ.10 వేలు, శాలువా, బ్యాడ్జ్ అందిస్తారు.