ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వందేళ్ళ తరువాత ఇప్పుడే !

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదే భూముల రీ-సర్వే. వైఎస్సార్ జగనన్న శాశ్వత భూమి హక్కు- భూమి రక్షణ పేరుతో అన్ని భూముల రీ-సర్వేకు నిర్ణయం తీసుకుంది ఏపీ క్యాబినెట్. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూములన్నింటినీ రీ-సర్వే చేయనున్నారు. రీ-సర్వే కోసం రూ. 1000 కోట్ల నిధులను కేటాయించారు.

వచ్చే ఏడాది జనవరి నుంచి జూన్ 2023 నాటికి దశల వారీగా రీ-సర్వే పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుంది. ఇందుకోసం 4500 సర్వే టీములను సిద్దం చేస్తున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. రీ-సర్వేలో ఉత్పన్నమయ్యే భూ సమస్యల పరిష్కారానికి మొబైల్ కోర్టులను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు అయన తెలిపారు. ఫిజికల్ బౌండరీలను ఫిక్స్ చేస్తామన్న ఆయన సర్వే రాళ్లను ప్రభుత్వమే ఇస్తుందని అన్నారు. ఇక గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్లు జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. 100 ఏళ్ల తర్వాత మళ్లీ భూ సర్వేను చేయబోతున్నామని మంత్రి ప్రకటించారు.