పుష్ప సినిమానే ఆదర్శం.. హైదరాబాదులో ఎర్రచందనం అక్రమ రవాణా ముఠా అరెస్ట్

రెడ్ శాండీల్ అక్రమ రవాణా ముఠాను అరెస్ట్ చేశామన్నారు జాయింట్ సీపీ కార్తికేయ. అటవీ శాఖ అధికారులు, టాస్క్ ఫోర్స్ ఈ ఆపరేషన్ చేశారని తెలిపారు. వారి వద్ద నుండి 75 లక్షల విలువైన 500 కిలోల ఎర్ర చందనం ను సీజ్ చేశామన్నారు. ఈ కేసులో ఐదు మందిని అరెస్ట్ చేసినట్టు పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు కడప జిల్లాకు చెందిన షేక్ అబ్దుల్లా ఒక టీమ్ ని ఏర్పాటు చేసి రెడ్ శాండీల్ స్మగ్లింగ్ చేస్తున్నారని తెలిపారు.

రవి చంద్ర అనే వ్యక్తి ద్వారా ఎర్రచందనాన్ని తీసుకొని అక్రమంగా హైదరాబాద్ కు తరలిస్తున్నారని వివరించారు. ఈ ముఠా హైదరాబాద్ మార్కెట్ లో అమ్మకాలు చేస్తుండగా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి దేశ వ్యాప్తంగా వేరే రాష్ట్రాలకు ఇది స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. గతంలో కూడా ఇలాంటి స్మగ్లింగ్ చేస్తూ వస్తున్నారని.. ఎర్ర చందనం ముందుగా శంఫుల్ గా బైక్ పై తీసుకొచ్చారని తెలిపారు. ముందు వారిని పట్టుకోగా.. తరువాత ముఠా ను అరెస్ట్ చేసి 500 కిలోల రెడ్ శాండీల్ ను సీజ్ చేశామన్నారు.

గతంలో రవి చంద్ర ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో ఉన్నాడని తెలిపారు. పుష్ప సినిమా ను ఆదర్శంగా తీసుకోని ఈ స్మగ్లింగ్ చేస్తున్నట్లు అనుమానిస్తున్నామన్నారు. నిందితుల పై 447, 427, 379,120- B , 109 రెడ్ విత్ 34 IPC కింద కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసులో విచారణ చేస్తున్నామని.. పరారీ లో ఉన్న నిందితుడు రవి చంద్ర ను త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు.