మార్గదర్శిలో కేసులో రామోజీరావుకు ఊరట లభించింది. మార్గదర్శిలో ఆడిటింగ్ పై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. మార్గదర్శిలో ఆడిట్ కోసం రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే.. ఆడిటర్ నియామకం, ఆడిటింగ్ తదుపరి చర్యలపై స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఆడిటర్ నియామకం, ఆడిటింగ్ ను సవాల్ చేస్తూ మార్గదర్శి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. నిర్దుష్ట చిట్, చిట్ గ్రూప్ ప్రస్తావించకుండా ఆడిటింగ్ కు ఆదేశించడం చట్టసమ్మతం కాదని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. జ్యూరిస్టిడిక్షన్ లేకపోయినా రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్ ఆడిటర్‌ను నియమించినట్లు కనిపిస్తోందని వెల్లడించింది. రిజిస్ట్రార్ ఆఫ్ చిట్స్‌కు ఇలా ఆడిట్ కు ఆదేశించే అధికారం లేదని పేర్కొంది. తదుపరి విచారణ జూన్ 19 కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.