చంద్రబాబు భార్య భువనేశ్వరికి సెన్స్ ఉందా? అని మంత్రి రోజా ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు ప్రజలు అండగా ఉండాలన్న భువనేశ్వరి వాక్యాలపై రోజా తీవ్రంగా స్పందించారు. ప్రజల ఆస్తిని బాబు దోచుకున్నాడనే సెన్స్ ఆమెకు ఉందా? అని దుయ్యబట్టారు.
జనం డబ్బుతో హైదరాబాద్ లో బాబు ప్యాలెస్ కట్టుకున్నారని ఆరోపించారు. ఇక తన తండ్రిని చెప్పులతో కొట్టించినా మాట్లాడలేదని, కానీ ఇవాళ ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తుందన్నారు. ఆటు పురందేశ్వరిని బాధ చూస్తే… ఆమె బావ జనతా పార్టీని నడుపుతున్నట్లు ఉందని సెటైర్లు వేశారు.
ఒక్కసారి జైలులో అడుగుపెడితే మళ్లీ బయటకు రాననే విషయం చంద్రబాబుకు తెలుసనీ మంత్రి రోజా తెలిపారు. ‘పవన్ కళ్యాణ్ ను చూస్తుంటే డౌట్ వస్తోంది. లోకేష్ కు లేని బాధ పవన్ కు ఎందుకు? కిందపడి, మీదపడి దొర్లుతున్నాడే. ప్యాకేజీకే డ్రామా చేస్తున్నారా? లేదా చంద్రబాబు ఆస్తికై డ్రామా చేస్తున్నాడా అని లోకేష్ కే అనుమానం వచ్చేంతలా పవన్ యాక్టింగ్ ఉంది. త్వరలో లోకేష్, అచ్చెన్న అరెస్ట్ అవుతారు’ అని ఆమె ఆరోపించారు.