గాడిదకేమి తెలుసు గంధపు వాసన – నాగబాబుకు రోజా కౌంటర్

-

మంత్రి రోజా, జనసేన నేత నాగబాబు మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది. మంత్రి రోజా తన నియోజకవర్గం లోని పరిధిలో 11 లక్షలతో నిర్మించిన చిన్నపాటి తాగునీటి పథకాన్ని ఫిబ్రవరి 7వ తేదీన నిండ్ర మండలంలోని జీడి కండ్రిక, ఎంసీ కండ్రికల్లో నిర్మించిన తాగునీటి బోరు, పైప్ లైన్ లను రోజా ప్రారంభించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను ఆమె ట్వీట్ చేశారు.

అయితే దీనికి సంబంధించిన ఫోటోలు మార్ఫింగ్ చేసిన కొందరు ” వైయస్సార్ పోలవరం” ని ప్రారంభించిన రోజా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్రోల్ చేశారు. ఈ మార్ఫింగ్ ఫోటోని జనసేన నేత నాగబాబు పోస్ట్ చేస్తూ.. ” హంద్రీనీవా సుజల స్రవంతిని రోజా ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభం ద్వారా వైసిపి ( మాయ) పార్టీ నాయకురాలు రోజా చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చారని, రాయలసీమలోని 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి త్రాగునీరు అందించినట్లు సమాచారం ” అని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.

నాగబాబు చేసిన ఈ ట్వీట్ కి తాజాగా మంత్రి రోజా స్పందించారు. ” ఆ గ్రామ ప్రజలు ఐదు దశాబ్దాలుగా ఈ నీటి కోసం ఎదురుచూస్తున్నారు. సుదూర ప్రాంతం నుంచి పైప్ లైన్ లాగి త్రాగునీటిని ఇచ్చాము. ( నాగబాబు) గాడిదకేమి తెలుసు గంధపు వాసన, నేను కాబట్టి ఇదిగో వివరాలు చూపిస్తున్న, ఆ గ్రామానికి వెళ్లి ఈ వెటకారం మాటలు మాట్లాడి చూడు తగిన రీతిలో చెప్తారు గుణపాఠం!” అని కౌంటర్ విసిరారు.

Read more RELATED
Recommended to you

Latest news