చిరంజీవి పాటకు స్టెప్పులు వేసిన మంత్రి రోజా !

-

శ్రీకాకుళం జిల్లాలో శిల్పారామం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా వెల్లడించారు. 76 వ స్వాతంత్య్రం సందర్భంగా కళ్లేపల్లిలోని ఆనందోబ్రహ్మ, స్పిరిట్యువల్ టాబ్లెట్స్ వారిచే హంస ధ్వని తొమ్మిదో వార్షికోత్సవం జరిగింది. 12వ తేదీ నుండి 14 వరకు మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఆమె ముఖ్య అతిథిగా పర్యాటక శాఖ మంత్రి రోజా హాజరయ్యారు.

హంసధ్వని పుస్తకాన్ని ఆవిష్కరించిన రోజా .. చామంతి పువ్వా పువ్వా… పాటకు స్టెప్ లు వేసి జనాలను ఉత్సాహ పరిచారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ మంత్రి రోజా మాట్లాడుతూ.. ధ్యానం చేస్తుంటే ఎంతో రిలేక్షేషన్ ఉంటుంది.. కళలకు సేవ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు అన్నారు.

స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటాలు మరువలేనివని.. ఆనాడు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడిన నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాంతంలో శిల్పారామం ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నాం.. త్వరలోనే శిల్పారామంకు భూమి పూజ చేస్తామని ప్రకటించారు.ధ్యానం, నాట్యం, సంగీతం వలన మంచి ఆరోగ్యం అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news