ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్-షర్మిల వివాదం పై తల్లి విజయమ్మ నిన్న ఓ లేఖను రాసిన విషయం తెలిసిందే. ముఖ్యంగడా తల్లిగా తనకు జగన్, షర్మిల ఇద్దరూ సమానమే అని.. ఒక బిడ్డ ఇంకో బిడ్డకు అన్యాయం చేస్తుంటే.. చూసి తట్టుకోవడం కష్టం ఉందన్నారు. అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడటమే నా ధర్మమని.. వైఎస్సార్ బతికి ఉంటే ఆస్తుల సమస్య వచ్చేది కాదని లేఖలో పేర్కొన్నారు.
విజయమ్మ రాసిన లేఖ పై వైసీపీ స్పందిస్తూ.. ఆమె కొన్ని అంశాలనే లేఖలో వెల్లడించింది. ముఖ్యంగా జగన్ బెయిల్ రద్దు కుట్రను విజయమ్మ ప్రస్తావించకపోవడం పక్కదోవ పట్టించడమేనని.. షర్మిల ఒత్తిళ్లకు లొంగి ఆమె ఇలా వ్యవహరించారని పేర్కొన్నారు. తాజాగా వైసీపీకి షర్మిల కౌంటర్ ఇచ్చారు. జగన్ బెయిల్ రద్దుకు కుట్ర అనడం ఈ శతాబ్దపు పెద్ద జోక్ అని సెటైర్లు వేశారు షర్మిల. ఈడీ అటాచ్ చేసింది రూ.32 కోట్లు విలువైన కంపెనీ ఆస్తి. షేర్ల బదిలీ పై ఆంక్షలు లేవు.. విజయమ్మకు రూ.42 కోట్ల షేర్లు ఎలా అమ్మారు..? నాకు 100 శాతం వాటాలు ఇస్తామని ఎంవోయూ పై జగన్ సంతకం చేశారు. బెయిల్ రద్దు అవుతుందని సంతకం చేసినప్పుడు తెలియదా..? అని ప్రశ్నించారు షర్మిల.