ఏపీలో మరో స్కాం…ఫ్రీ హోల్డ్ లోకి కొన్ని ప్రభుత్వ భూములు ?

-

ఏపీలో మరో స్కాం బయటకు వచ్చింది. ఫ్రీ హోల్డ్ స్కాంలో వెలుగులోకి మరో బాగోతం బయటకు వచ్చింది. ఫ్రీ హోల్డులోకి కొన్ని ప్రభుత్వ భూములు వచ్చాయట. గత ప్రభుత్వ నిర్వాకాలపై మంత్రి అనగాని సంచలన ప్రకటన చేయడం జరిగింది. ప్రభుత్వానికి చెందిన కొన్ని భూములను కూడా గత ప్రభుత్వం ప్రీ హోల్డ్ పెట్టేశారని గుర్తించింది రెవెన్యూ యంత్రాంగం. ఫ్రీ హోల్డులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలపై లెక్కలు తీస్తోన్నారు రెవెన్యూ శాఖ అధికారులు.

Some government lands into freehold

రెవెన్యూ సదస్సుల్లో గత ప్రభుత్వ భూ బాగోతాలన్నీ బయటకు వస్తాయంటున్నారు మంత్రి అనగాని. కొన్ని ప్రభుత్వ భూములను కూడా నిషేధిత జాబితా నుంచి ఫ్రీ హోల్డ్ చేశారని… ప్రజా అవసరాలకు ఉంచిన ప్రభుత్వ భూములను ఫ్రీ హోల్డ్ చేసి రిజిస్ట్రేషన్లు చేశారని ఆరోపణలు చేశారు మంత్రి అనగాని. నిజమైన అసైనీలకు న్యాయం చేసేందుకే మూడు నెలల పాటు ఫ్రీ-హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ల నిలిపివేశామన్నారు. ఫ్రీ హోల్డ్ వ్యవహారంలో జరిగిన తప్పులన్నింటీని సరిచేస్తామని ప్రకటించారు మంత్రి అనగాని.

Read more RELATED
Recommended to you

Exit mobile version