ఆలు లేదు చూలు లేదు… ఏపీ సీఎం “కాపు”!

-

ఆలు లేదు చూలు లేదు… ఏపీ సీఎం “కాపు”!నిన్నమొన్నటివరకూ ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణేమో సరిగ్గా మాట్లాడడు.. కలుపుకునిపోడు.. కలిసిరాడు.. ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నరీతిగా ఉంటాడని ఒక వర్గం టాక్! ఇప్పుడున్న అధ్యక్షుడు సోము వీర్రాజేమో… భూమి మీద ఆగడంలేదు, మైకుల ముందు ఫైరవుతున్నారు, మైకు ఆపితే కుల ప్రసంగాలు చేసేస్తున్నారు! ఇందులో భాగంగా బీజేపీ అధికారంలోకి వస్తే ఏపీ సీఎం “కాపు” అని అంటున్నారు!

అవును… నిన్న మొన్నటివరకూ బీజేపీ – జనసేన అభ్యర్ధే 2024 తర్వాత ఏపీ సీఎం అని మొదట్లో చెప్పుకొచ్చారు సోము వీర్రాజు! సరే కొత్త ఉత్సాహం.. జనసేన కార్యకర్తలను కూడా ఉత్సాహపరచడానికి వేసిన బాణం అని అంతా భావించారు! అయితే తాజాగా… 2024 ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా తాము అధికారంలోకి వ‌స్తామ‌ని, కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారని చెబుతున్నారు!

ఇందులో ఒక రకంగా చూస్తే పెద్దగా ఓపెన్ చేసిన సీక్రెట్ ఏమీ లేదు! ఎందుకంటే… ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కనా లక్ష్మీనారాయణ.. కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తి! ఇక సోము వీర్రాజు, జనసేన అధినేత కూడా కాపు సామాజికవర్గానికి చెందినవారే! ఇందులో వీర్రాజు కొత్తగా చెప్పిన సీక్రెట్ అనుకుంటున్న విషయంవల్ల ఒరిగిందేమీ లేదు! కానీ… నష్టమైతే ఉంది!

ఎందుకంటే… జాతీయ పార్టీలకు సంబంధించిన పార్టీలు, రీజనల్ విషయాలకు వచ్చేసరికి సీఎం విషయంలో కాస్త సీక్రసీ మెయింటైన్ చేయడంతోపాటు.. ఇతరవర్గాలవారు ఇబ్బంది పడకుండా నెట్టుకొస్తుంటారు! ఒక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డి విషయంలోనే కాంగ్రెస్ కు ఆ పప్పులు ఉడకలేదు కానీ.. మిగిలిన అందరి విషయంలోనూ అదే! అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా!

అయితే.. ఈ విషయంలో కాస్త ఓపెన్ అయిపోయిన వీర్రాజు చెప్పిన విషయం.. అప్రస్తుతం, అనవసరం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి! అల్లూ లేదు చూలూ లేదు.. ఈ సమయంలో సీఎం గురించిన మాటలు అవసరం లేదు అనేది విశ్లేషకుల మాట! ఈ సమయంలో అన్ని సామాజికవర్గాలనూ కలుపుకుంటూపోతే… అన్నీ అనుకూలంగా జరిగిన తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడొచ్చు కదా!! పైగా జాతీయ పార్టీల విషయంలో.. ఇక్కడ సీఎం ఎవరనేది పెద్ద విషయం కాదు!!

రీజనల్ పార్టీల విషయంలో ఇది పూర్తిగా రివర్స్ లో ఉంటుంది! వీరి విషయంలో ఇక్కడ వ్యక్తే ముఖ్యం.. జాతీయ పార్టీల విషయంలో పార్టీ ముఖ్యం! ఈ లాజిక్ మరిచిన వీర్రాజు… అప్పుడే కుల ప్రస్థావన తీసుకురావడం అనేది తెరవెనుక, ఎవరికీ తెలియకుండా జరిపించాలి తప్ప.. ఇలా బయటకు వచ్చేటంతగా కాదు అని పలువురు సూచిస్తున్నారు!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news