జగన్ సర్కార్ పైబీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని.. మూడు రాజధానుల పేరుతో అవినీతికి పాల్పడతారా..? అని నిలదీశారు. గతంలో చంద్రబాబు కూడా రాజధాని పేరుతో అవినీతికి పాల్పడ్డారని.. గత ఐదేళ్లల్లో చంద్రబాబు రాజధాని నిర్మించలేక పోయారు.. ఇప్పుడు మూడేళ్లైనా జగన్ రాజధాని ఊసే ఎత్తడం లేదని మండిపడ్డారు.
ప్రజలు వైసీపీని అధికారంలోకి తెచ్చింది అప్పులు చేయడం కోసం కాదని.. ఈ ప్రభుత్వానికి అప్పులు పుట్టవని… ఏపీ ప్రభుత్వానికి అప్పులు ఎందుకు పుట్టడం లేదో ఆలోచించుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ ట్రాపులో పడకుంటే..చంద్రబాబు బీజేపీతోనే ఉండేవారని సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలవరం కోసం చంద్రబాబు అదనంగా అడిగిన రూ. 25 వేల కోట్లనే ఇప్పుడు జగన్ అడుగుతున్నారని.. పోలవరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇచ్చిందా..? అని ఫైర్ అయ్యారు.