టీడీపీతో పొత్తులపై సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

-

తెలుగుదేశం పార్టీతో పొత్తులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. బిజెపితో పొత్తు పెట్టుకున్నట్లు చంద్రబాబు ఎక్కడైనా చెప్పారా..? అని ప్రశ్నించారు. ఇరు పార్టీల నుండి ప్రకటన రాకుండా జరిగే ప్రచారాలకు తాము ఎలా సమాధానం చెబుతామన్నారు. అమిత్ షా తో చంద్రబాబు కలిసినంత మాత్రాన ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ఊహించుకుంటే తాము ఏం చెబుతామన్నారు.

తమ పార్టీ పెద్దలతో సమావేశం అయ్యాక చంద్రబాబు ఎక్కడా ఆ అంశంపై మాట్లాడలేదన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు మారాయని, భవిష్యత్తులో ఇంకా మారతాయని చెప్పారు. రాష్ట్రానికి డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమన్నారు. ఏపీకి డబుల్ ఇంజన్ సర్కార్ కావాలనేది తన ఆకాంక్ష అని, ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ చేసిన అభివృద్ధి, సంక్షేమం అందరికీ కనిపిస్తున్నాయన్నారు. వైసీపీ ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేసిందో కూడా ప్రజలకు తెలుసని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news