రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీలో రాజకీయాలు హీటెక్కియి. బిఆర్ఎస్ నాయకులు చల్మెడ లక్ష్మీనరసింహారావు- ఎమ్మెల్యే చందమనేని రమేష్ బాబు మధ్య పొలిటికల్ వారు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వేములవాడ టిఆర్ఎస్ రెండు వర్గాలుగా విడిపోయింది. తాజాగా చెన్నమనేని రాజకీయ కోటలో చల్మెడ మీటింగ్ ఏర్పాటు చేశారు. నేడు వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ యువసమ్మేళనం పేరుతో కార్యక్రమం నిర్వహించారు.
చల్మెడ సోంత మండలం కోనరావుపేటలో మొదటి సభకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి భారిగా యూత్ నాయకులతో పాటు ప్రజాప్రతినిధులకు ఆహ్వానం అందింది. దీంతో బీఆర్ఎస్ నేత చల్మెడ యువసమ్మేళనంపై రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాజకీయ చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ సమ్మేళనానికి వెళ్ళొద్దని చెన్నమనేని వర్గీయులకు ఆదేశాలు జారీ అయ్యాయి. వేములవాడ లో చల్మెడ వర్సెస్ చెన్నమనేనిగా రాజకీయాలు కొనసాగుతున్నాయి. దీంతో వేములవాడ బీఆర్ఎస్ శ్రేణులు అయోమయంలో ఉన్నారు. మరోవైపు ఇద్దరు నేతలు కూడా ఎవరికి వారే తనదే టికెట్ అంటూ అనుచరుల దగ్గర చెప్పుకుంటున్నారు.