వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు

-

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. మే 31వ తేదీన తెలంగాణ హైకోర్టు ఆయనకు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ వివేకా కుమార్తె సునీతా నర్రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం.. అవినాష్‌కు నోటీసులు ఇచ్చింది. సునీత పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను జులై 3వ తేదీకి వాయిదా వేసింది.

వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి మే 31వ తేదీన తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐకి రూ.5 లక్షలకు వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని, దర్యాప్తు పూర్తయ్యేవరకు సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని, సాక్షులను ప్రభావితం చేయరాదని, సాక్ష్యాలను తారుమారు చేయరాదని ఆదేశించింది. నిష్పాక్షిక, సత్వర దర్యాప్తునకు అడ్డంకులు కలిగించేలా ఎలాంటి చర్యలూ చేపట్టరాదని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news