చంద్రబాబుకు తిక్కారెడ్డి వార్నింగ్ ఇచ్చారు…టికెట్ ఇవ్వక పోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. మంత్రాలయం టిడిపి ఇంచార్జీ పి తిక్కారెడ్డికి టికెట్ కేటాయించక పోవడంతో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై టిడిపి నేత పి తిక్కారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మంత్రాలయం టిడిపి టికెట్ విషయంలో పునరాలోచించాలని కోరారు తిక్కారెడ్డి. టికెట్ ఇవ్వక పోతే ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమని చెప్పారు.
చంద్రబాబు ఆఫీస్ లో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి బ్రోకర్లు ఉన్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు చుట్టూ ఉన్నవారు డబ్బులకు అమ్ముడు పోయి జగన్ కోవర్టులుగా పనిచేస్తున్నారని ఆగ్రహించారు తిక్కారెడ్డి. త్వరలో 500 వాహనాలలో చంద్రబాబు దగ్గరకు బల ప్రదర్శనకు సిద్ధమని తెలిపారు.టికెట్ కేటాయించిన బిసి నేత రాఘవేంద్ర రెడ్డికి ఓటు వేస్తే బాలనాగిరెడ్డికి వేసినట్లేనని సంచలన కామెంట్స్ చేశారు తిక్కారెడ్డి. బాలనాగిరెడ్డికి కోవర్టుగా రాఘవేంద్ర రెడ్డి పనిచేస్తున్నారన్నారు తిక్కారెడ్డి.