ఏపీ విద్యార్థులకు శుభవార్త..సీఎం జగన్ ఈనెల 28న పార్వతీపురం జిల్లా కురుపాంలో పర్యటించనున్నారు. జగనన్న అమ్మబడి పథకంలో భాగంగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ. 13 వేల చొప్పున జమ చేయనున్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత తొలిసారి జగన్ వస్తుండటంతో భారీగా జన సమీకరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అధికారులు సభాస్థలం, హెలిప్యాడ్ ప్రాంతాలను పరిశీలించారు. వారికి మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి, సీఎం కార్యక్రమాల సమన్వయ అధికారి రఘురాం పలు సూచనలు చేశారు. ఇక అటు ప్రభుత్వ విద్యారంగంలో మరో విప్లవాత్మక అడుగుకు సీఎం వైయస్.జగన్ శ్రీకారం చుట్టారు. ప్రపంచస్థాయి పోటీని తట్టుకునేలా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ప్రభుత్వ విద్యార్థులకు టోఫెల్ పరీక్షల నిర్వహణ ఈ అంశంలో శిక్షణ, నిర్వహణలకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్)తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.