పాపం చలి తట్టుకోలేక మంచం కింద కుంపటి పెట్టుకుని సజీవ దహనం అయిపొయింది…!

డిసెంబర్ నెల రాకుండానే, కార్తిక మాసం అడుగుపెట్టకుండానే మన తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగిపోయింది. రెండు రాష్ట్రాల్లో చలి తీవ్రతతో వృద్దులు చిన్నారులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర మన్యంలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. పగలు ఎండగా ఉన్నా సరే రాత్రి సమయంలో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. దీనితో ఇళ్ళ నుంచి కూడా జనాలు బయటకు రావడం లేదు.

ఈ తరుణంలో ఒక వృద్దురాలు చలి మంట పెట్టుకుని ఆహుతి అయిపోయింది. విజయనగరం జిల్లాలో ఈ ఘటన జరిగింది. పార్వతీపురంలో దారుణం చోటు చేసుకుంది. చలి తట్టుకోలేక మంచం కింద పెట్టిన కుంపటి సెగతో మంటలు చెలరేగాయి. దీనితో సావిత్రమ్మ అనే వృద్ధురాలు సజీవ దహనం అయిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.