BREAKING: మాండూస్ తుఫాన్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం విడుదల

-

మాండూస్ తుఫాన్ కి ఆంధ్రప్రదేశ్ లోని చాలా జిల్లాలు ఎఫెక్ట్ అయ్యాయి. ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. వరదలకు లోతట్టు ప్రాంతవాసులు చిగురుటాకులా వణికిపోయారు. బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్న వారికి ఆశాదీపంలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఆరు జిల్లాలలోని 32 మండలాలలో తుఫాను తీవ్ర ప్రభావం చూపింది.

ఈ జిల్లాలలో ప్రమాదకరమైన లోతట్టు ప్రాంతాల నుంచి అధికార యంత్రాంగం 708 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. అంతేకాదు తుఫాను బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని విడుదల చేసింది. ఒక్కో వ్యక్తికి రూ. వెయ్యి చెప్పున, గరిష్టంగా కుటుంబానికి రెండు వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. పునరావాస కేంద్రాల నుంచి ఇళ్ళకి తరలించేటప్పుడు డబ్బులు ఇవ్వాలని ఆదేశించింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైయస్సార్ జిల్లాలోని బాధితులకు ఆర్థిక సాయం అందించనుంది.

Read more RELATED
Recommended to you

Latest news