కర్నూలు జిల్లా పత్తికొండలో దారుణం జరిగింది. భర్త హరిప్రసాద్ మృతదేహానికి భార్య లలిత ఇంట్లోనే దహన సంస్కారాలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఉన్న చీరలు, పాత బట్టలు వేసి భర్తను తగలబెట్టగా… భర్త గుండెపోటుతో చనిపోతే, ఎవరూ లేకపోవడంతో ఇంట్లోనే దహన సంస్కారాలు చేసినట్లు భార్య చెబుతోంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అటు భర్తను హత్య చేసి ఆమె నాటకం ఆడుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. అయితే.. కొన్నేళ్లుగా అనారోగ్యంతో ఆమె భర్త మంచం పట్టాడని..ఒక కొడుకు కెనెడా లో ఉండగా మరో కొడుకు స్థానికంగా మెడికల్ షాప్ నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెప్పారు. కొడుకులు పట్టించుకోక, తాను చూడలేక ఇంట్లోనే అట్టముక్కలు వేసి భార్యనే నిప్పు పెట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.