అక్రమంగా లింగనిర్ధారణ చేసి గర్భస్రావాలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్

-

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. అక్రమంగా లింగనిర్ధారణ చేసి గర్భస్రావాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు చేశారు వరంగల్ పోలీసులు. గర్భస్రావాలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన 18 మంది నిందితులను అరెస్టు చేశారు వరంగల్‌ పోలీసులు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, టాస్క్ ఫోర్సు, కేయూనిపోలీసులు అరెస్టు చేసారు. వీరిని నుంచి మూడు లింగనిర్ధారణకు వినియోగించే స్కానర్లు, 18 సెల్ఫోన్లు, 73వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో వున్నారని పేర్కొన్నారు. హస్పటల్స్ హనుకొండలోని లోటస్ హస్పటల్, గాయత్రి హస్పటల్, నెక్కొండలోని ఉపేందర్ (పార్థు) హస్పటల్, నర్సంపేట్ లోని బాలాజీ మల్టీ స్పెషాల్టీ హస్పటల్స్ కి సంబంధం ఉన్నట్లు తేల్చారు. వేముల ప్రవీణ్, వేముల సంధ్యారాణి, డా. బల్నే పార్ధు, డా. మోరం అరవింద, డా. మోరం శ్రీనివాస్ మూర్తి, డా. బాల్నెపూర్ణిమ, బాల్నె ప్రదీప్ రెడ్డి, కైత రాజు, తల్లా అర్జున్, డి. ప్రణయ్ బాబు పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఉన్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news