శ్రీవారి ఆనంద నిలయానికి.. బంగారు తాపడం పనులకు ముహూర్తం ఖరారు..65 ఏళ్ల తర్వాత తొలిసారి

-

తిరుమల శ్రీవారి ఆనంద నిలయానికి.. బంగారు తాపడం పనులకు ముహూర్తం ఖరారు అయింది. 65 ఏళ్ల తరువాత ఆనంద నిలయ గోపురానికి బంగారు తాపడం పనులు చేయనుంది టీటీడీ పాలక మండలి. ఈ ఏర్పాట్లను దగ్గరుండి చేస్తున్నది తిరుమల తిరుపతి దేవస్థానం. ఫిబ్రవరి నుంచి పనులు ప్రారంభించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 23వ తేదీన బాలయం ఏర్పాటు చేసి.. ఆరు నెలల్లో బంగారం తాపడం పనులు పూర్తి చేయాలని డిసైడ్‌ అయింది.
దీంతో ఈ కార్యక్రమం పనులు ప్రారంభం కానున్నాయి.

ఇక అటు తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని నిర్ణయించింది. నేటి నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఇన్నాళ్లు వీఐపీ బ్రేక్‌ దర్శన సమయాన్ని ఉదయం పూట అనుమతించే విధానాన్ని రద్దుచేశారు. నేటి నుండి ప్రయోగాత్మకంగా శ్రీవారి బ్రేక్ దర్శన సమయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు.

ఇకనుంచి బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మార్చబోతున్నారు. సర్వదర్శనంకోసం గంటల తరబడి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో రాత్రి వేళ వేచి ఉండే భక్తులకు ఉదయం పూట త్వరితగతిన దర్శనం కల్పించేందుకు వీలుగా వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news