రికార్ట్‌ స్థాయిలో తిరుమల ఆదాయం.. శ్రీవారి ఆస్తులు ఎన్ని వేల కోట్లంటే !

-

తిరుమల తిరుపతి దేవస్థానం..ప్రపంచంలోనే అత్యంత ధనికమైన దేవాలయం. అయితే.. తిరుమల తిరుపతి దేవస్థానం శనివారం నిర్వహించిన పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ భేటీలో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సందర్భంగా టీటీడీకి సంబంధించిన ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేసింది. ఈ వివరాలను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు.

టీటీడీకి 960 ఆస్తులు ఉండగా, వాటి విలువ రూ. 85,700 కోట్లు అని తెలిపారు. ఇక తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీకి వినియోగించే పదార్థాలను సేంద్రీయ వ్యవసాయం ద్వారా పండించిన వాటినే వినియోగించాలని టిటిడి పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇక, రూ.95కోట్లతో యాత్రికులు వసతి సమోదాయం 5 నిర్మాణం జరుగుతాయన్నారు. తిరుపతిలో రూ.30 కోట్లతో వకుళామాత ఆలయం అభివృద్ధి, తిరుమలలోని వసతి గృహాల్లో గీజర్ల ఏర్పాటుకు రూ. 7.90 కోట్లు ఆమోదం, నెల్లూరులో శ్రీవారి ఆలయం, కళ్యాణ మండపం నిర్మాణానికి ఆమోదం జరిగిందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news