తిరుమల భక్తులకు శుభవార్త. ఈ నెల 24వ తేదీన ఆన్ లైన్ లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. జులై, ఆగస్టు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని.. టికెట్లకు అప్లై చేసుకోవాలని టీటీడీ పాలక మండలి సూచించింది.
కాగా, తిరుమలలో నిన్న 9 కంపార్ట్‌మెంట్లలో వేచివున్నరారు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 85,297 మంది భక్తులు కాగా, తలనీలాలు సమర్పించిన 37,392 మంది భక్తులు గా ఉన్నారు. హుండీ ఆదాయం రూ. 3.71 కోట్లు గా నమోదు అయింది.