బోయ, వాల్మీకిలను ఎస్టీల్లో…దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చుతూ ఏపీ అసెంబ్లీ ఆమోదం

-

ఇవాళ ఏపీ అసెంబ్లీ లో రెండు అప్రాప్రియేషన్ బిల్లులతో సహా ఐదు బిల్లులను ప్రవేశపెట్టింది జగన్ ప్రభుత్వం. ఇక ఇప్పటికే ఐదు బిల్లులను ఆమోదించింది ఏపీ అసెంబ్లీ. కాసేపటి క్రితమే.. రెండు తీర్మానాలను సభలో ప్రవేశపెట్టింది జగన్‌ ప్రభుత్వం. బోయ/వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ తీర్మానం చేసింది ఏపీ ప్రభుత్వం.

ఈ తీర్మానం ను సభలో ప్రవేశపెట్టారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన. ఈ తరుణంలోనే ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది ఏపీ అసెంబ్లీ. అటు క్రిస్టియన్లుగా కన్వర్ట్ అయిన దళితులను ఎస్సీలుగా పరిగణించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తూ మరో తీర్మానం పెట్టింది. ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున. ఈ తరుణంలోనే.. ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది ఏపీ అసెంబ్లీ. ఈ రెండు తీర్మానాలను కేంద్రానికి పంపించనుంది జగన్ ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news