వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో భాగంగా ఇవాళ కడపకు 15 మందితో కూడిన సి.బి.ఐ బృందం చేరుకుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అదుపులో ఉదయకుమార్ రెడ్డి ఉన్నారు. వివేక హత్య జరిగిన రోజు ఆయన భౌతిక గాయానికి మొదటిసారిగా ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి జయ ప్రకాష్ రెడ్డి…వైద్యం చేశారు.
ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్లో కాంపౌండర్ గా పని చేస్తున్నారు జయ ప్రకాష్ రెడ్డి. సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ లో ఉదయ్ కుమార్ రెడ్డి ప్రస్తావన గురించి పేర్కొంది సిబిఐ. గూగుల్ టేక్ అవుట్ ద్వారా ఉదయ్ కుమార్ రెడ్డి వివేక హత్య రోజు ఎక్కడెక్కడ ఉన్నాడో గుర్తించింది సిబిఐ. ఎంపి అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నారు ఉదయ్ కుమార్ రెడ్డి. ఇక ఈ విచారణ అనంతరం ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.