బ్రేకింగ్ : నీట మునిగిన రాజధాని గ్రామం ?

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన ఉద్దండరాయుని పాలెం లంక గ్రామాలు నీట మునిగినట్టు సమాచారం. సుమారు 150 కుటుంబాలు నిన్న రాత్రి నుండి నీటిలోనే బిక్కు బిక్కు మంటూ గడుపుతున్నారని వెలుగులోకి వచ్చింది. నిన్నటి నుండీ కరెంట్ లేక పోగా తినడానికి ఆహారం కూడా ఏమి లేక అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే అక్కడ ఏమీ ఇబ్బంది లేదని స్థానిక ఎమ్మార్వో చెబుతున్నారు. దీంతో ఆ లంకలోని 150 కుటుంబాలు ఆందోళనలో ఉన్నారు.

ఇవతల ఒడ్డున ఉన్న వారిని సహాయం చేయమని ప్రజలు వేడుకుంటున్నారు. రంగంలోకి దిగిన తుళ్ళూరు ఎంఆర్ఓ లీలకుమారి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరో పక్క కృష్ణాకు వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 7,01,619 క్యూసెక్కులుగా ఉంది. వరద నీరు చేరుతున్నప్పుడే ముందస్తుగా సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని, కృష్ణా పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె కన్నబాబు పేర్కొన్నారు.