నిత్యానందలా ఎక్కడో దీవులు చూసుకోండి..చంద్రబాబుపై విజయసాయి సెటైర్

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. నిత్యానందలా ఎక్కడో దీవులు చూసుకోండని చురకలు అంటించారు. ఏపీ అప్పులంటూ, శ్రీలంకైపోతుందంటూ టీడీపీ జూనియర్ ఆర్టిస్టులు, డూపులు, గ్రూప్ డాన్సర్లు, వాంప్ లు రంగంలోకి దిగారు. రాష్ట్రం శ్రీలంక కాదు గానీ మీ నారా అల్జీమర్స్ నాయుడు మాత్రం 2024 ఎన్నికల తర్వాత గొటబాయ కావడం ఖాయమని హెచ్చరించారు.

నిత్యానందలా ఎక్కడో దీవులు చూసుకోండి. కరకట్టను నమ్ముకుంటే ఖతమేనని ట్వీట్‌ చేశారు విజయసాయిరెడ్డి. చంద్రబాబు ప్రభుత్వం కేవలం అయిదుగురు కోసం మాత్రమే పనిచేస్తే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అయిదు కోట్ల మంది ప్రజల అభివృద్ధి కోసం పనిచేస్తోంది. ఏపీ శ్రీలంక కావడం కాదు.. చంద్రబాబే రాజపక్సే లాగా ఏ సింగపూరో పారిపోతాడని ఫైర్‌ అయ్యారు. బడుగు, బలహీన, అణగారిన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చేసేందుకు జగన్ గారి ప్రభుత్వం ఖర్చు చేస్తుంటే ఉచితాలంటూ విమర్శించడం తగదని హెచ్చరించారు.