అధికారం కోసం ఏ గడ్డి కరవడానికైనా చంద్రబాబు సిద్ధం – విజయసాయి

-

అధికారం కోసం ఏ గడ్డి కరవడానికైనా చంద్రబాబు సిద్ధం అన్నారు వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి. అధికారం కోసం ఏ గడ్డి కరవడానికైనా చంద్రబాబు సిద్ధం. కుటుంబాలను నిట్టనిలువునా చీలుస్తాడని ఫైర్‌ అయ్యారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కుని, ఆయన సంతానాన్ని కూడా తనవైపు తిప్పుకోవటం దగ్గర నుంచి ఈ నీతి బాహ్యమైన క్రీడను మొదలుపెట్టాడని ఆగ్రహించారు.

vijayasai reddy on cbn over mudragada

తాజాగా కాపు నేత ముద్రగడ గారి కుటుంబంలో నిప్పులు పోశాడన్నారు. అన్నచెల్లెళ్లు, తండ్రీ కొడుకులను విడదీయటం, చివరకు కడుపులోని బిడ్డను తల్లికి వ్యతిరేకంగా మార్చగల నికృష్టుడు అంటూ ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు వైసీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి. నెల్లూరు పారిశ్రామిక అభివృద్ధే నా ఆకాంక్ష. అందులో భాగంగానే మెగా ఇండస్ట్రియల్ పార్క్, మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, వుడ్ పల్ప్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి పారిశ్రామికంగా నెల్లూరును అగ్రగామిగా నిలుపుతామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version