మహా న్యూస్ పై మరోసారి విజయసాయిరెడ్డి సంచలన పోస్ట్ పెట్టారు. మహా న్యూస్ ఉరఫ్ “మహా చెత్త న్యూస్” అనేది సూట్ కేస్ కంపెనీ అని ఆదాయ పన్ను అధికారులు ఈ కంపెనీ అకౌంట్స్ ని సీజ్ చేశారని సెటైర్లు పేల్చారు. అలాంటి కంపెనీని నువ్వెలా కొన్నావురా, పౌడర్ డబ్బా? నువ్వు సుజనా చౌదరికి చెల్లించిన రూ.11 కోట్లు నగదు రూపంలోనా? లేక బ్యాంకు ద్వారానా? వంద రూపాయలు విలువ చెయ్యని నీకు రూ.11 కోట్లు ఎలా వచ్చాయన్నారు.
దాని Source ఏమిటి? కంపెనీ Share/Asset వాల్యుయేషన్, జీతాలు, కనీస వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపులపై గత 7 సంవత్సరాలకు సంబంధించి దర్యాప్తు జరగాల్సి ఉందని డిమాండ్ చేశారు. ఓనమాలు రాయలేని, పొట్టపొడిస్తే అక్షరం ముక్క రాని, జర్నలిస్ట్ అనికూడా సరిగా పలకలేని ఓ మోసగాడు కులం మద్దతుతో బ్లాక్ మెయిలర్ గా, పాత్రికేయుడు గా అవతారమెత్తి ధర్నా చేయాలనీ పిలుపు ఇస్తే పదిమంది జర్నలిస్టులు కూడా వెళ్ళలేదన్నారు. వీడు నన్ను ఆంధ్రకు రాకుండా అడ్డుకుంటాడట. అసలు హైదరాబాద్ లో నీ ఆఫీస్/స్టూడియో ఉంటుందో ఊడుతుందో చూసుకోరా, టాల్కమ్ పౌడర్ డబ్బా అంటూ రెచ్చిపోయారు విజయసాయిరెడ్డి.