లోకేష్ పాదయాత్ర కోసం డాన్స్ లు..విజయసాయిరెడ్డి సెటైర్లు

నారా లోకేష్‌ చేపట్ట బోయే పాదయాత్రపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన స్టైల్‌ లో సెటైర్లు పేల్చారు. పప్పేష్! నీ పాదయాత్ర కోసం ఈ డాన్స్ షూటింగులు ఏంటి? తెలుగు డ్రామాల పార్టీ కామెడీ షో ‘పులిని చూసి నక్క వాతలు’ పెట్టుకోవడమే అంటూ చురకలు అంటించారు సాయిరెడ్డి.

దద్దమ్మను సిఎం చేయండని దేబిరించడానికా? పార్టీ నీది కాదు. ఏం చేస్తావో చెప్పువు. పాటల షూటింగులు, ‘సినిమా’ ప్రమోషన్లకే కోట్లు తగలేసేటట్టున్నావు బొకేష్! అని ఫైర్ అయ్యారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.

వ్యక్తిత్వ నిర్మాణంలో లోపాలు తీవ్ర ఆత్మన్యూనతా భావానికి దారితీస్తాయి. దొరకాల్సిన గౌవరవం దక్కడం లేదని, తిరస్కృతులుగా మారామనే ఆందోళన వీరిని సమాజంపై అకారణ ద్వేషం కనబర్చేలా చేస్తుంది, చంద్రం, పప్పు, కుల మీడియా ది ఇదే పరిస్థితి. దురుసుతనం, అనాగరిక ధోరణి దీని లక్షణాలు అని మరో ట్వీట్‌ చేశారు విజయ సాయిరెడ్డి.