అమిత్ షా – jr NTR సంభాషణపై మౌనమేల? అని నారా చంద్రబాబుపై విరుచుకుపడ్డారు విజయసాయిరెడ్డి. ఢిల్లీలో చంద్రబాబుతో ప్రధాని రెండు నిమిషాలు మాట్లాడితేనే ఆహా… ఓహో అంటూ పచ్చ కుల మీడియా చెలరేగిపోయింది. పక్కనే ఉండి వారి సంభాషణ విన్నట్లు కథనాలు అల్లింది. మరి రామోజీతో అమిత్ షా ఏం మాట్లాడారో …అమిత్ షా – jr NTR సంభాషణపై మౌనమేల? అని నిలదీశారు విజయసాయిరెడ్డి.
ఎన్నికల హామీలను చంద్రబాబు నెరవేర్చలేదని .. అందుకే అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహంతో వున్నారని దుయ్యబట్టారు విజయసాయిరెడ్డి. 33 ఏళ్లు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. కుప్పం తన చేతి నుండి జారిపోతుందని చంద్రబాబుకి భయం కలిగిందని దుయ్యబట్టారు. భయంతోనే ఎప్పుడూ లేని విధంగా తరచూ కుప్పంకి వెళ్తున్నారని, చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి గాలేరు నగరి ఎందుకు పూర్తి చెయ్యలేదని నిలదీశారు. పెగ్గు రాజుతో స్నేహం తర్వాత మా బాబన్న రెండు పెగ్గులు వేస్తున్నాడో తెలియదన్నారు సాయిరెడ్డి.