విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. దీంతో విజయవాడ నగర వాసులకు ట్రాఫిక్ కష్టాలు తిరనున్నాయి.. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం పనులు ఎట్టకేలకు పూర్తి అవడంతో.. దాన్ని ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వాస్తవానికి సెప్టెంబర్ 4న ఫ్లై ఓవర్ ప్రారంభించాలని మొదట అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రణబ్ మృతితో ప్రారంభం వాయిదా పడింది.
ఆ తర్వాత సెప్టెంబర్ 7 లేదా 8న ఫ్లైఓవర్ ప్రారంభించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అవేమీ నిజం కాదని.. ప్రభుత్వ నిర్ణయం వేరే ఉందని తేలిపోయింది. తాజా సమాచారం మేరకు.. కనకదుర్గ ఫ్లైఓవర్ ను ఈ నెల 18న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీల చేతుల మీదుగా ప్రారంభించనున్నారని తెలుస్తుంది. ఈ విషయాన్ని టీడీపీ ఎంపీ కేశినేని నాని వెల్లడించారు.
కనకదుర్గ ఫ్లైఓవర్ ను నితిన్ గడ్కరీ @nitin_gadkari గారు ఈ నెల 18 వ తేదీన ప్రారంభిస్తారు. pic.twitter.com/WzTXsFFt8Y
— Kesineni Nani (@kesineni_nani) September 4, 2020