నేడే విశాఖ గర్జన..3 రాజధానులకు లక్ష మందితో భారీ ర్యాలీ

-

నేడే విశాఖ గర్జన నిర్వహించనున్నారు. విశాఖ గర్జన నేపథ్యంలో మూడు రాజధానులు నినాదం…మారుమ్రోగనుంది. వికేంద్రీకరణకు మద్దతుగా లక్ష మందితో భారీ ర్యాలీ తీయనున్నారు. ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధి నినాదంతో ముందుకు వెళ్లనున్నారు. ఎల్.ఐ.సీ.జంక్షన్ అంబెడ్కర్ సర్కిల్ నుంచి బీచ్ రోడ్ వరకు సుమారు 4కి.మీ ర్యాలీ నిర్వహించనున్నారు ఉత్తరంద్ర నేతలు.

ఇక ఇప్పటికే జె.ఏ.సీ.కి సంపూర్ణ మద్దతు ప్రకటించింది వైసీపీ. శాంతియుతంగా జరిగే ర్యాలీ ద్వారా ఉత్తరాంద్ర ఆకాంక్షలను దిక్కులు పిక్కటిల్లేలా చెబుతామంటుంది జె.ఏ.సీ. మూడు రాజధానులు, జాతీయ పతాకాలతో ర్యాలీని లీడ్ చేయనున్నారు 50 మంది స్కెటర్లు. బీచ్ రోడ్డులో బహిరంగ సభ ఉండనుంది.

జె.ఏ.సీ, ప్రభుత్వం నుంచి కొద్ది మందికి మాత్రమే మాట్లాడే అవకాశం ఉంది. గర్జన కోసం వెయ్యి మందికి పైగా పోలీసు భద్రత కల్పించారు. ప్రధాన కూడళ్ల మీదుగా ర్యాలీ జరగడంతో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్ కు వెళ్లే ప్రయాణీకులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. గర్జనకు వచ్చే వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ఏరియాలు ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news