వచ్చే ఎన్నికలలో 175 కి 175 సీట్లు మనమే గెలవాలని టిడిపి శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. సోమవారం అమరావతిలో టిడిపి విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ కి రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు లేదని అన్నారు. కురుక్షేత్ర యుద్ధం మొదలైందని.. ఇక కౌరవ వధ జరగాల్సిందేనని అన్నారు. కౌరవ సభను గౌరవ సభ చేస్తామని అన్నారు చంద్రబాబు.
రాష్ట్రంలో ప్రస్తుతం భయంకరమైన వాతావరణం ఉందన్నారు. ఇక్కడ స్వేచ్ఛగా మాట్లాడితే తప్పుడు కేసులు, ఆస్తులు జప్తు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో భూముల విలువ భారీగా పడిపోయిందని.. పరుగు రాష్ట్రం తెలంగాణలో ఎకరం అమ్మితే ఇక్కడ 100 ఎకరాలు కొనుగోలు చేయవచ్చని అన్నారు. నాసిరకం మందులతో పేద ప్రజల ప్రాణాలతో చెలగటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.