జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం తన సీటుని త్యాగం చేస్తానని టిడిపి నేత చింతమనేని ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హఠాత్తుగా చింతమనేని ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే చింతమనేని ఇప్పుడు సీటు గురించి ఎందుకు మాట్లాడారు. ఒకప్పుడు పవన్ పైనే విమర్శలు చేసిన చింతమనేని..ఇప్పుడు సీటు ఎందుకు త్యాగం చేస్తున్నారనేది చర్చగా మారింది.
ఇప్పటివరకు పవన్ ఎక్కడ పోటీ చేస్తారో క్లారితే లేదు..అటు టిడిపి, జనసేనల మధ్య పొత్తు ఫిక్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో పవన్ దెందులూరు నియోజకవర్గానికి వచ్చి పోటీ చేస్తానంటే తన సీటు త్యాగం చేసేందుకు సిద్ధమని, అంతే కాదు పవన్ను భుజాలపై ఎక్కించుకొని గెలిపిస్తానంటూ మరో ఆఫర్ కూడా ఇచ్చారు. జనసేన అధినేత దెందులూరు కోరుకుంటే త్యాగం చేసేందుకు సిద్ధమన్నారు. తాను సీటు త్యాగం చేసే విషయంలో తమ నాయకుడు చంద్రబాబు తీసుకునేదే ఫైనల్ నిర్ణయం అన్నారు. దెందులూరు సీటు ఎవరికి ఇచ్చినా గెలిపిస్తామని తెలిపారు.
అయితే ఇలా పవన్ గురించి మాట్లాడటం వెనుక కారణం ఏమైనా ఉందా? లేక దెందులూరులో జనసేన శ్రేణులని ఆకట్టుకోవడానికి చింతమనేని ఇలాంటి చెప్పారా? అనే డౌట్ వస్తుంది. గతంలో దెందులూరులో పవన్ కల్యాణ్..చింతమనేనిపై విమర్శలు చేశారు. ఆయన్ని ఓడించాలని ప్రచారం చేశారు.
ఈ క్రమంలో దెందులూరులో కాపుల ఓట్లు చింతమనేనికి ఓట్లు పడలేదు. వైసీపీకి పడ్డాయి. దీంతో చింతమనేని ఓటమి పాలయ్యారు. అయితే ఇప్పుడు కాపుల ఓట్లని ఆకట్టుకోవడానికి చింతమనేని ఇప్పుడు పవన్ కల్యాణ్ కోసం సీటు త్యాగం చేస్తానని చెప్పినట్లు తెలుస్తుంది.