సరిగ్గా పనిచేయట్లేదు..టీడీపీలో అచ్చెన్న సంచలనం..!

-

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మరో సంచలనానికి తెరలేపారు. తనతో పాటు..పార్టీలో నేతలు సరిగ్గా పనిచేయట్లేదని ప్రజలు గెలిపించేస్తారనే ధీమాతో ఉన్నారని అంటున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడటంతో ఇటీవల చంద్రబాబు మినీ మేనిఫెస్టో విడుదల చేసిన విషయం తెలిసిందే. దీన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు టి‌డి‌పి నేతలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో 5 జోన్లగా టి‌డి‌పి నేతలు బస్సు యాత్ర చేస్తూ..మేనిఫెస్టోని ప్రజలకు వివరించనున్నారు.

ఈ క్రమంలోనే బస్సులని టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, కానీ తనతో సహా నేతలు ఎవరూ కూడా పూర్తి స్థాయిలో పని చేయడం లేదనే ఫీలింగ్ ఉందని, కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజల్నేలో ఉండేలా కార్యాచరణ రూపొందించుకోవాలని నేతలకు సూచించారు.

దసరాకు టీడీపీ పూర్తి మ్యానిఫెస్టో విడుదల చేస్తున్నామని, అందులో ఉద్యోగులకు సంబంధించి కీలక అంశాలు ఉంటాయని అచ్చెన్న చెప్పుకొచ్చారు. అలాగే సీఎం జగన్ అప్పులు తెచ్చి అరకొర సంక్షేమం అందిస్తున్నారని, కానీ చంద్రబాబు భవిష్యత్తులో సంపద సృష్టించి పూర్తిస్దాయిలో సంక్షేమాన్ని అమలు చేస్తారని, ప్రచార కార్యక్రమాల్ని నేతలు సీరియస్ గా తీసుకోవాలని, చంద్రబాబుతో చెప్పించుకునే పరిస్దితి తెచ్చుకోవద్దని అన్నారు.

అయితే అచ్చెన్న మాటల్లో వాస్తవం ఉందని కొందరు టి‌డి‌పి శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే కొందరు నేతలు మొదట నుంచి సరిగ్గా పనిచేయడం లేదు. పార్టీ గాలి ఉంటే గెలిచేస్తామనే ధీమాలో ఉండిపోయారు. ఇప్పటికే పలుమార్లు చంద్రబాబు..నేతలకు క్లాస్ ఇచ్చారు. అయినా సరే కొందరిలో మార్పు రాలేదు. అందుకే ఇప్పుడు అచ్చెన్న ఓపెన్ అయినట్లు కనిపిస్తున్నారు. మరి ఇకనైనా టి‌డి‌పి నేతల్లో మార్పు వస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news