చంద్రబాబు పరిపాలనను షర్మిల ఎందుకు ప్రశ్నించలేదని మంతెన మాధవి వర్మ అడిగారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నారు. వైఎస్సార్ సంక్షేమం, అభివృద్ది రెండు కళ్లుగా భావించి పాలన కొనసాగించారు. చంద్రబాబు లక్ష కోట్లకు పైగా అప్పులు చేసి వెళ్లి పోయారు. 2019 ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు నమ్మకనే ప్రతిపక్షంలో ఉన్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా చంద్రబాబు పరిస్థితి అదే అన్నారు.
రాష్ట్రంలో అభివృద్ధి జరుగకుండా కోర్టుల్లో కేసులు పెట్టి బాబు అడ్డుకుంటున్నారు. షర్మిల ఆంధ్ర కోసం మాట్లాడటం హాస్యస్పదంగా ఉందన్నారు. ఇన్ని రోజులు తెలంగాణలో రాజకీయాలు చేసి.. ఇవాళ వచ్చి ఆంధ్ర కోసం మాట్లాడటం ఏంటి..? అని ప్రశ్నించారు. రాష్ట్రమంతా తిరిగితే అభివృద్ధి ఎంత జరిగిందో తెలుస్తుంది. చంద్రబాబు పాలనను షర్మిల ఎందుకు ప్రశ్నించలేకపోయారు..? ఎంత మంది కలిసి వచ్చినా సీఎం జగన్ ను ఏమి చేయలేరన్నారు. చంద్రబాబు ప్రయోజనాల కోసమే షర్మిల ఏపిలో రాజకీయాల్లోకి వచ్చారు.