ఆ విషయంలో చూడాల్సింది రాష్ట్ర ఖజానా కాదు… జగన్ ఖలేజా!

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా క‌రోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. క‌రోనా పేరు వింటేనే ప్రపంచం మొత్తం వణికిపోయే ప‌రిస్థితి. ఈ పరిస్థితుల్లో క‌రోనా న‌ష్ట నివార‌ణ చ‌ర్యల విషయంలో జగన్ ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు.. ఫలితంగా ఏపీ సీఎం అనుస‌రిస్తున్న విధానాలపైనా, చూపిస్తున్న ఉదారతపైనా ప్ర‌శంస‌ల వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఏపీ ఖజానాలో అంత సొమ్ము లేకపోయినా… జగన్ ఎలా చేసుకుపోతున్నారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి!

క‌రోనాతో క్వారంటైన్‌ లో చేరిన రోగి… డిశ్చార్జి అయ్యే స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.3వేలు అందిస్తుంది. క్వారంటైన్ సమయంలో అతనికి ఆదాయం ఉండదు.. క్వారంటైన్ నుంచి బయటకు వెళ్లాక ఎప్పటికి ఆదాయం వస్తుందో తెలియదు.. ఈ సమయంలో ప్రభుత్వం కాకపోతే మరెవరు అర్ధంచేసుకుంటారు.. ఇంకెవరు ఆదుకుంటారు అని భావించిన జగన్… మూడువేల సాయాన్ని అందుస్తున్నారు! ఇది చిన్న విషయం కాదు!!

ఈ క్రమంలో తాజాగా క‌రోనా మృతుడి అంత్య‌క్రియ‌ల‌కు రూ.15 వేలు చొప్పున ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇప్పటికే కరోనా పుణ్యమాని రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల‌తో కొట్టుమిట్టాడుతోంది. దాంతో.. జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితితి.. మరో వైపు సంక్షేమ ప‌థ‌కాలు, ఇంకోవైపు ఊహించని రీతిలో క‌రోనా ఎఫెక్ట్. అయినా కూడా జగన్ వెనక్కి తగ్గడంలేదు.. సమస్యలను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొంటున్నారు.

ఇదే క్రమంలో కరోనాను తొక్కిపడేసే కార్యక్రమాల్లో భాగంగా… 17వేల మంది వైద్యులు, 12వేల మంది న‌ర్సుల‌ను తీసుకోవాల‌ని సీఎం జగన్ సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. అలాగే… కోవిడ్ కేర్ సెంట‌ర్లు, క్వారంటైన్ కేంద్రాల నుంచి ఫిర్యాదుల స్వీక‌ర‌ణ‌కు కాల్ సెంటర్ నెంబర్ డిస్ ప్లే ఏర్పాటు చేయాల‌ని కూడా జ‌గ‌న్ స‌ర్కార్ ఆదేశించింది. ఇవన్నీ చేయడానికి ఉండాల్సింది ఖజానా కాదుగా… ఖలేజా ఉండాలి!

దీంతో… ఈ విషయాలన్నీ గ్రహించిన ఏపీ వాసులు… ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకునే విషయంలోనూ, సమస్యలను ఎదుర్కోనే విషయంలోనూ జగన్ లో చూడాల్సింది “ఖజానా” గురించి కాదు.. అన్ని రకాల ఇబ్బందులనూ ఎదుర్కంటూ కరోనాపై యుద్దం ప్రకటించిన ఆయన “ఖలేజా” గురించి అని కామెంట్లు చేస్తున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news