వైసీపీ ప్లీనరీ సమావేశంపై విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. వైసీపీ ప్లీనరీకి 9 లక్షలమంది వచ్చారని… పోలీసులు, వాలంటీర్లు, ఆరోగ్య కార్తకర్తలు అద్బుతంగా పనిచేశారని వెల్లడించారు. ప్రమాదంలో మరణించిన వాలంటీర్ దినేష్ కుటుంబానికి 5లక్షల పరిహారం పార్టీ తరఫున అందిస్తామని ప్రకటించారు విజయసాయిరెడ్డి.
ప్లీనరీ జరగకుండా వర్షం పడితే బాగుండని చంద్రబాబు అనుకున్నాడని.. అలాంటి శాడిస్టు మనస్తత్వం చంద్రబాబుదని మండిపడ్డారు. ప్లీనరీకి వచ్చిన దినేష్ చనిపోయారు.. పోయిన ప్రాణం తీసుకు రాలేకపోయినా సాయం అందిస్తామని పేర్కొన్నారు.
ప్లీనరీకి ఆటంకం కలగకుండా పోలీసులు బాగా పని చేశారని… ప్రజాస్వామ్య బద్దంగా జగన్ని ఎన్నుకున్నామని చెప్పారు. అంతర్గత ప్రజాస్వామ్యం లేదనటం కరెక్టు కాదని.. ఏకగ్రీవంగా ప్రతి ఒక్కరూ జగన్ని శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని ప్రకటించారు.
అది పబ్లిక్ గానే జరిగిందన్నారు విజయసాయిరెడ్డి.