విశాఖపట్నం : పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తాజా మూవీ భీమ్లా నాయక్. అయితే.. రేపే “భీమ్లా నాయక్” విడుదల అవుతున్న నేపత్యంలో… ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలకు సెలవు ప్రకటిస్తున్నట్టు ఫేక్ సర్క్యులేషన్ విడుదలైంది.
ప్రిన్సిపల్ పేరు మీద వైరల్ గా మారింది ఈ ఫేక్ సర్క్యులర్. అయితే.. దీనిపై 3 టౌన్, సైబర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ పేరి శ్రీనివాసరావు. దీంతో ఈ సంఘటనపై కేసు నమోదు చేసి… ఫేక్ సర్కులర్ సృష్టించిన వారి కోసం ఆరా తీస్తున్నారు విశాఖపట్నం పోలీసులు.
ఇక అటు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. “భీమ్లా నాయక్” ను ఏపీలో ఎవరూ ఆపలేరని జగన్ సర్కార్ ను హెచ్చరించారు పవన్ కళ్యాణ్ ఏపీ ఫ్యాన్స్. విజయవాడ పట్టణంలోని అలంకార్, శైలజా థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇవాళ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో ఐదో షోకు అనుమతివ్వాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జగన్ సర్కార్ ను డిమాండ్ చేశారు.